Friday, April 22, 2011

లక్ష్మీనారాయణ హొమం

మీరు భక్తిని, సంగీతాన్ని సమదృష్టితో చూడగలగుతారా..... మనం పాడుతున్నప్పుడో, ఓ పాట వింటున్నప్పుడో మన ఆత్మ ఓ అన్వేషణకు భయలుదేరిన అనుభూతికి లోనవుతాము., అది అలా ఎందుకు జరుగుతుందో మనకు స్పస్టత వుండదు. కాని! ఆ వెతుకులాట మాత్రం ఎప్పుడూ వుంటూనే వుంటుంది, మన ప్రయత్నం లేకుండానే అటువంటి అన్వేషణ మనలో నిగూడంగా వుందన్న విషయం తెలుసుకోకుండానే చాలా మంది భౌతికమైన తమ జీవితాల నుండి నిష్క్రమిస్తూ వుంటారు. మనలో వున్న వెతుకులాట ఏమిటో? అసలు మనకేం కావాలో తెలుకొనే ప్రయత్నం కోసమే గురు శ్రీ కొండవీటి జ్యోతీర్మయి గారి ఆద్వర్యంలో "లక్ష్మీనారాయణ హొమం" జరుగుతుంది.
గురు శ్రీ కొండవీటి జ్యోతీర్మయి గారి సంకీర్తనలు, వేదపండితుల మంత్రోచ్చారణల అపూర్వ సంగమంతో జరుగుతున్న ఈ మహా హొమంలో మన మందరం పాల్గొని మన ఆత్మను, హొమ రూప నారాయణుని ముందు ఆవిష్కరిద్దాం. ఇక మనం చేసే ప్రతి పనిలోనూ ఆ పరమాత్మ స్పర్శను అనుభవిద్దాం......... ఈ మే నెల ఇరువైతొమ్మిదిన హైదరాబాద్‌లో జరిగే ఈ అరుదైన క్రతువులో పాల్గొనండి.
వివరాల కోసం
గురు కొండవీటి జ్యోతీర్మయి సెంట్రల్‌ ట్రస్ట్‌,

No comments:

Post a Comment