రంగులంటే ఇష్టముండని వాళ్లు ఎవరుంటారు.! ఫేవరెట్ కలర్ ఏంటి అని ఎవరినైనా అడిగామనుకోండి తను అలవాటు పడ్డ ఏదో ఒకటీ, రెండు రంగులు చెప్తారు.
అంత మాత్రం చేత మిగిలిన రంగులంటే ఇష్టం లేదనికాదు. అన్ని రంగులని స్రృశించకపోవడమే....
పోనీ! మనం ఇష్టం అనుకున్న రంగులలో హాయిగా ఒదిగిపోతున్నామా!
ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే మనకంటుకుంటున్న రంగులు ఎన్నో, ఒక్కోసారి ఆ రంగులే మన జీవితాన్ని మర్చేస్తాయి. అవి ఎంతలాగా మార్పు తెస్తాయంటే అప్పుటి వరకూ అంటి పెట్టుకొని మనవీ అన్న రంగులన్నీ అపరిచితులుగా కనిపిస్తాయి. చాదస్దమైన రంగులుగా కూడా అనిపిస్తాయి.
మనలో వున్నది ఓ రంగు అయితే ఎదుటివాళ్ళకు మరో రంగులో కనిపిస్తాము.
అమ్మ పొత్తిళ్ల నుండి పుడకల పక్క వరకూ నడిచిన మన నడకలు ఎన్నో రంగులను పరిచయం చేస్తాయి.
వాటిలో కొన్నిత్వరగా వెలిసిపోతాయి...
మరి కొన్నిరంగులు మరణం తరువాత కూడా మన గురుతులుగా మిగిలిపోతాయి....
నాకు దగ్గరగా తెలిసిన కొందరి ప్రముఖవ్యక్తుల అసల రంగులతో నా బ్లాగును నింపబోతున్నాను.
No comments:
Post a Comment